TG: వేగంగా వెళ్తున్న రెడీ మిక్స్ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట నియో పోలీస్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మితిమీరిన వేగంతో, నిద్రమత్తులో లారీ నడపడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన డ్రైవర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.