రోడ్డుపై లారీ బోల్తా పడిన ఘటన మహారాష్ట్రలోని బీడ్(D) వద్వాని(M) ఖడ్కి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఖడ్కిలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డును పర్యవేక్షించేందుకు ఇంజనీర్, అధికారుల బృందం వెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక లారీ బోల్తా పడటంతో అధికారులు భయంతో పరుగులు తీశారు. అధికారుల సాక్షిగా అవినీతి బట్టబయలైందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.