గుడిసెపై లారీ బోల్తా.. వృద్దురాలు మృతి

AP: నంద్యాల జిల్లా శివారులలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్న చెరువు కట్ట సమీపంలో మహానంది వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెపై పడింది. ఈ ఘటనలో గుడిసెలో నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు పుల్లమ్మ లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. అధిక లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్