కారు, బైక్‌లపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

ఒడిశాలోని గంజం జిల్లా చామఖండి ఛక్‌లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. టర్నింగ్ వద్ద కారు, బైక్‌లు రోడ్డు మధ్యలో ఆగి ఉండగా, వేగంగా దూసుకొచ్చిన లారీ వాటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే ఓవర్‌బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ రోడ్డును దిగ్బంధించారు.

సంబంధిత పోస్ట్

✕
✕