లారీ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టు వద్ద పూలు కోస్తున్న ఇద్దరు మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా ఖడబాగ మెయిన్ రోడ్డుపై శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో అహల్య గౌడ (55) అనే మహిళ స్పాట్లోనే మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.