రెండు వంతెనల మధ్య ఇరుక్కున్న లారీ

TG: సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా 161వ జాతీయ రహదారిపై మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. గుజరాత్‌కు చెందిన ఓ లారీ టైల్స్‌ లోడుతో హైదరాబాద్‌కు వెళ్తుండగా.. డ్రైవర్‌ నిద్రమత్తుతో అదుపుతప్పి రెండు వంతెనల మధ్య ఇరుక్కుంది. ఈ ఘటనలో లారీ ముందు చక్రాలు, పలు పరికరాలు ఊడిపోయి కిందపడ్డాయి. అయితే వంతెనల కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕