పుచ్చకాయతో బరువు తగ్గండి: వైద్యులు

పుచ్చకాయ తినడం వల్ల బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో 92 శాతం నీరు, తక్కువ కేలరీలు ఉండటంతో వేడి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే సిట్రులిన్ అనే అమినో ఆమ్లం కొవ్వు నిల్వలను తగ్గించి కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది. విటమిన్లు, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు శక్తిని అందిస్తాయి. పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్