చెక్‌బుక్ కనిపించకుండా పోయినా, చోరీకి గురైనా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. బ్లాంక్ లేదా సంతకం చేసిన చెక్కులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. చెక్‌బుక్ పోయినట్లు గుర్తించిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చి స్టాప్ పేమెంట్ చేయించాలి. ఆన్లైన్ లేదా హోమ్ బ్రాంచ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీసులకు ఫిర్యాదు చేయడం, FIR కాపీని బ్యాంకుకు అందించడం మంచిది. సంతకం చేసిన చెక్కులు ఉంటే తక్షణమే బ్యాంకుకు తెలియజేయాలి. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే 1930కు కాల్ చేసి, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.