రైలు ప్రయాణంలో మొబైల్ ఫోన్ పోయినప్పుడు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి దక్షిణ రైల్వే ఒక కొత్త డిజిటల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) టెలికమ్యూనికేషన్ విభాగం ఈ సేవలను అందిస్తున్నాయి. ప్రయాణికులు రైల్ మదద్ యాప్ లేదా 139 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదు ఆధారంగా, సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌లో మొబైల్ వివరాలు నమోదు చేసి, ఫోన్ IMEI నంబర్ ఆధారంగా పరికరాన్ని బ్లాక్ చేస్తారు. దీనివల్ల PSకు వెళ్లే అవసరం లేకుండానే తక్షణ రక్షణ లభిస్తుంది.