ప్రేమ పెళ్లి.. భార్యను కొట్టి చంపాడు

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చివరికి కొట్టిచంపాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో చోటు చేసుకుంది. సందీప్ వర్మ, రీమా వర్మ(30) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 8 ఏళ్ల కుమార్తె ఉంది. కొన్నాళ్ల నుంచి మనస్పర్థలతో సహా భూమి విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆ కోపంలోనే మంగళవారం రీమాను దారుణంగా కొట్టి, గొంతు నులిమి చంపేసి పారిపోయాడు. అర్థరాత్రి మామ ధర్మేశ్‌కు ఫోన్ చేసి.. నీ కూతురిని చంపానని చెప్పాడు. బుధవారం రీమా తండ్రి ధర్మేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న సందీప్ కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕