AP: ఏలూరు జిల్లా, కైకలూరులోషాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రేమ వివాహం నేపథ్యంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ జరిగింది. చటాకాయకు చెందిన కుమార్ (22), నత్తగుల్లపాడు గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (22) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి ఇరువురి పెద్దలు ఒప్పుకోకపోవడంతో శుక్రవారం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ప్రేమ వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఆ ప్రేమ జంటకు రక్షణ కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.