TG: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు సంతోష్, గంగోత్రిలు నెల రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దసరా పండక్కి సంతోష్ గంగోత్రితో కలిసి ఆమె తల్లి గారి ఇంటికి వెళ్లారు. అక్కడ వాగ్వాదం జరగగా భర్త తిరిగి ఇంటికి వెళ్ళాడు. మనస్తాపం చెందిన గంగోత్రి ఈ నెల 2న ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా బంధువుల ఇంటికి వెళ్లిన సంతోష్ మంగళవారం చనిపోయినట్లు సమాచారం అందింది. కాగా సంతోష్ మృతికి గల కారణాలు తెలియరాలేదు