ఇన్‌స్టాలో ప్రేమ.. ఉరేసుకుని యువతి ఆత్మహత్య

AP: తూ.గో. జిల్లా గోకవరం మండలానికి చెందిన యువతి (19)కి ఇన్‌స్టాలో యువకుడితో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ రాజమహేంద్రవరం వెళ్లారు. అప్పటికీ ఆ అబ్బాయి మైనర్. ఇరువురూ ఇళ్లకు వచ్చిన తర్వాత పెద్దల పంచాయతీలో బాలుడు మేజరైనప్పుడు పెళ్లి చేయాలని అంగీకరించినట్లు తెలిసింది. ఇటీవల యువకుడి వయసు పద్దెనిమిది దాటడంతో యువతి కుటుంబ సభ్యుల నుంచి పెళ్లి ఒత్తిడి రావడంతో.. కులం పేరు ప్రస్తావిస్తూ దూషించారు. దాంతో యువతి మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్