ఝార్ఖండ్‌లోని ఓ గ్రామంలో ఇంటర్ కాస్ట్ వివాహం చేసుకున్న జంటకు గ్రామ పంచాయితీ వింత శిక్ష విధించింది. ముందుగా వారికి పెళ్లి జరిపించి, ఆ తర్వాత వారిద్దరి ముఖాలకు నల్లటి రంగు పూసి, మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, పలువురు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రేమ తిరుగుబాటు అని, సమాజం వైఫల్యమని, ప్రేమను కాకుండా అన్ని బంధాలను అంగీకరించే సమాజం ఇలాంటి వారిని శిక్షిస్తోందని విమర్శలు వస్తున్నాయి.