త‌క్కువ కేల‌రీల స్వీటెన‌ర్లతో గుండెకు ప్ర‌మాద‌మే

చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడుతున్న జైలిటాల్‌పై జరిగిన తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రక్తంలో జైలిటాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో గుండెపోటు, స్ట్రోక్, గుండె సంబంధిత మరణాల ముప్పు 57 శాతం అధికంగా ఉన్నట్లు 17,710 మందిపై ఆరు సంవత్సరాల పాటు నిర్వహించిన పరిశీలనలో గుర్తించారు. అయితే, జైలిటాల్ నేరుగా గుండెపోటుకు కారణమవుతుందని అధ్యయనం నిరూపించలేదని, మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. షుగర్ ఫ్రీ ఉత్పత్తుల్లో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕