అల్పపీడనం ఎఫెక్ట్.. 4 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశవ్యాప్తంగా తీవ్రమైన చలి, పొగమంచు కొనసాగుతుండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలకు కారణం కానుంది. ఉత్తర, మధ్య భారతదేశంలో రాబోయే 2-3 రోజులలో దట్టమైన ఉదయం పొగమంచు, చలిగాలులు వీచే అవకాశం ఉంది. జనవరి 9, 10 తేదీల్లో ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులను బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్