బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో శనివారం నుంచి ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.