ఈనెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం

ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వైపు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు భయపెడుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తదుపరి 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాబోయే రెండు, మూడు రోజులు సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని IMD పేర్కొంది.

సంబంధిత పోస్ట్