ఏప్రిల్ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరగవచ్చనే చర్చ నడుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. అయితే మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు సంక్షోభం కారణంగా ముడి చమురు, గ్యాస్ ధరలు అధికంగా ఉన్నాయి. 2026 మార్చిలో గృహ వినియోగ సిలిండర్ల ధరలు సుమారు రూ.965కు, వాణిజ్య సిలిండర్లు రూ.2105కు పెరిగాయి. దీంతో ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.