AP: విశాఖ పోర్టుకు ఎల్‌పీజీ నౌకలు వస్తున్నాయని పోర్టు ట్రస్టు ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. దీంతో ఎల్‌పీజీ సరఫరాలో ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంస్థ (డీసీఐ)కి రూ.307 కోట్ల విలువైన ప్రాజెక్టులు లభించాయని, కొత్త పోర్టులు, విధానాలతో డీసీఐ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు. మారిటైమ్ బోర్డుతో డీసీఐ సీఈవో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.