అదృష్టం అంటే వీరిదే.. నాడు అత్తకు, నేడు కోడలికి సర్పంచ్ పదవి!

తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు(M) కోనాపూర్ గ్రామంలో ఓ కుటుంబానికి అదృష్టం వరించింది. గ్రామంలో ఒక్కటే ఎస్టీ కుటుంబం ఉంది. అయితే గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వు అయింది. దీంతో ఒకే కుటుంబం నుంచి గతంలో అత్త బెల్లంకొండ రాములమ్మ ఇప్పుడు ఆమె కోడలు శ్రీలత పదవిని చేపట్టే అవకాశం దక్కింది. శ్రీలత ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో ఉన్న రాజకీయ ఏకాభిప్రాయం, సాంకేతిక రిజర్వేషన్ల కారణంగా శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్