నాలుగో రోజు లంచ్ బ్రేక్.. ఇంగ్లండ్ స్కోర్‌ 98/4

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్, భారత్‌ మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 2/0తో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. తొలి సెషన్‌లోనే ఆతిథ్య జట్టు.. క్రాలీ(22), డకెట్‌(12), పోప్‌(4), బ్రూక్‌(23) వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ 2, నితీశ్‌, ఆకాశ్‌దీప్‌ తలో వికెట్‌ తీశారు. ప్రస్తుతం క్రీజులో జో రూట్‌(17), స్టోక్స్‌(2) పరుగులతో ఉన్నారు.

సంబంధిత పోస్ట్