నాలుగో రోజు లంచ్‌ బ్రేక్.. వెస్టిండీస్‌ స్కోరు 252/3

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్‌ ఆడుతున్న వెస్టిండీస్‌ లంచ్‌ బ్రేక్‌ సమయానికి 252/3 పరుగులు చేసింది. 18 పరుగులు వెనుకబడి ఉంది. రోస్టన్‌ చేజ్‌ (23*), షై హోప్‌ (92*) క్రీజులో ఉన్నారు. క్యాంప్‌బెల్‌ 115, చందర్‌పాల్‌ 10, అథనేజ్‌ 7 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జడేజా తలో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 518/5 పరుగులకు డిక్లేర్డ్‌ చేయగా.. వెస్టిండీస్‌ 248 పరుగులకు ఆలౌటైంది.

సంబంధిత పోస్ట్