ఊపిరితిత్తి క్యాన్సర్ అనేది కేవలం పొగ తాగేవారిలోనే కాదు.. పొగ తాగని వారిలో కూడా పెరుగుతోంది. దీనికి గాలి కాలుష్యం, పర్యావరణ ప్రభావాలు కారణమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తి కణితిలో డీఎన్‌ఏ మార్పులు సంభవిస్తున్నాయి. ఇవి పొగ తాగడం వల్ల వచ్చే మార్పులతో సమానంగా ఉంటున్నాయి. అంటే ఎక్కువగా కాలుష్యంలో ఉన్నవారిలో కణితులు, DNA మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.