ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్స అనేది వ్యాధి రకం, దశ, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా సర్జరీ ద్వారా కణితిని తొలగించడం, కీమోథెరపీ ద్వారా మందులతో క్యాన్సర్ కణాలను నాశనం చేయడం, రేడియోథెరపీ ద్వారా కిరణాలు పంపించి కణాలను చంపేయడం, ఇమ్యూనోథెరపీ ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడం వంటి చికిత్సలు అందిస్తారు.