ఆసియా క్రీడల్లో భారత స్విమ్మింగ్ బృందానికి మరోసారి నిరాశ ఎదురైంది. నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ పాల్గొన్న పురుషుల 4x200 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే జట్టు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. సోమవారం జరిగిన క్వాలిఫికేషన్లో భారత జట్టు 7:24.32 సెకన్లలో రేసును పూర్తి చేసి 13 జట్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. వేదాంత్ తన నిరాశను సోషల్ మీడియాలో పంచుకోగా, తండ్రి మాధవన్ కొడుకు ప్రదర్శనపై గర్వంగా ఉన్నాననే భావాన్ని వ్యక్తం చేశాడు. వేదాంత్‌కు ఇంకా రెండు వ్యక్తిగత ఈవెంట్లు ఉన్నాయి.