సాయిబాబాపై మాధవీలత మరోసారి సంచలన వ్యాఖ్యలు

సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందన్న కారణంతో నటి మాధవీలతపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆమె అలాంటి వ్యాఖ్యలు చేశారు. సాయిబాబాను ఆరాధించేవారు హిందువులేనని, అయితే వారు పూర్తి స్థాయిలో హిందువులుగా మారడానికి సాయిబాబాను విడిచిపెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. తెలుగువారికి మహిమలు కలిగిన గురువులు ఎంతోమంది ఉన్నారని, వీరబ్రహ్మేంద్రస్వామి, రాఘవేంద్రస్వామి వంటి వారిని ఆరాధించాలని సూచించారు. హిందువులు అల్లాను ఆరాధించే సాయిబాబాను పూజించవద్దని, రామాయణం, మహాభారతం చదువుకోవాలని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్