బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ తన లేటెస్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. జనవరి 31న, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 'పియా తోసే నైనా లాగే రే' పాట క్యాప్షన్‌తో ఆరు గజాల బాటిల్ గ్రీన్ షేడ్ సిల్క్ చీరలో తన అందమైన ఫోటోలను పంచుకున్నారు. జర్దోజీ ఎంబ్రాయిడరీతో కూడిన ఈ చీర, జయంతి రెడ్డి లేబుల్ నుంచి వచ్చింది. దీని ధర రూ. 1,39,900. ఈ చీరతో పాటు ఆమె ఎంచుకున్న బ్లైజ్, మేకప్, హెయిర్‌స్టైల్ ఆమె లుక్‌ని మరింత గ్రాండ్‌గా మార్చాయి.