వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జుబేదా బేగం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.