కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన మాడ్గుల ముత్యాలమ్మ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచు కాయితి ఆశాదీప్ రెడ్డి, మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచు ఎట్టి సరిత విజయ్, గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.