ఉండవెల్లి మండలంలోని అలంపూరు చౌరస్తాలో ఉన్న మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల సమస్యలపై పదో తరగతి విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ ఘటనపై కలెక్టర్ సంతోష్ స్పందిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్లను సస్పెండ్ చేశారు. అలాగే ప్రిన్సిపల్, వార్డెన్, హౌస్ మాస్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.