పాఠశాల యాజమాన్యంపై విచారణ జరపాలని డిమాండ్

అలంపూర్ మండల కేంద్రంలోని మాంటిస్సోరి పాఠశాలలో విద్యార్థులపై అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అనుమతి లేకుండా వసతి గృహం నడుపుతున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపించింది. ఈ మేరకు స్థానిక మండల విద్యాధికారి అశోక్ కుమార్ కు వినతిపత్రం శుక్రవారం అందజేశారు. అధిక ఫీజుల వల్ల విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని, పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. అలాగే, కార్మికుల పని గంటలను రోజుకు 10 నుంచి 8 గంటలకు తగ్గించాలని కోరింది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్