రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అలంపూర్ మున్సిపాలిటీ ఐదో వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లెపోగు జమ్మన్న నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, తనను గెలిపిస్తే వార్డులోని సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.