అలంపూర్: పెండింగ్ డిఏ లు,పి ఆర్ సి వెంటనే ఇవ్వాలి

జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలంలో టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం 50 మంది ఉపాధ్యాయులు జిల్లా అధ్యక్షుడు డి రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా డి రమేష్ మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న 6 డిఏలు, పిఆర్సి వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయుల ఆరోగ్య కార్డులకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి ఓపియస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్