పశు సంరక్షణపై విద్యార్థులకు అవగాహన: ఉండవల్లిలో పశువైద్య శాఖ చర్యలు

శుక్రవారం నాడు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని స్థానిక హైస్కూల్లో 8, 9వ తరగతి విద్యార్థులకు పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంరక్షణ చట్టం, భారత రాజ్యాంగం ఆర్టికల్ 51A(g) ప్రకారం పశువుల సంరక్షణ బాధ్యతపై అవగాహన కల్పించారు. జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ శివానంద స్వామి మాట్లాడుతూ, పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని, వాటిపై దయ, కరుణ చూపాలని, క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని సూచించారు. రేబీస్, ఆంత్రాక్స్ వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాల సహాయ సంచాలకులు డాక్టర్ యూ ఆర్ రమేష్, హెడ్ మాస్టర్ ప్రనీత, ఉపాధ్యాయులు, పశువైద్య అధికారి డాక్టర్ సతీష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్