పశువుల గర్భకోశ వ్యాధులపై రైతులు అప్రమత్తం: డాక్టర్ స్వరూపరాణి

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని తుమ్మాజిపల్లి గ్రామంలో 29-01-2026, గురువారం నాడు ఉచిత పశు వైద్య, గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. మండల పశు వైద్య అధికారి డాక్టర్ స్వరూపరాణి యాదవ్ మాట్లాడుతూ, పాడి పశువుల గర్భకోశ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయంతో పాటు పశు సంపద ఉంటే రైతు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ శిబిరంలో 14 పశువులకు గర్భకోశ పరీక్షలు, 20 లేగదూడలకు నట్టల నివారణ మందులు, 15 పశువులకు సాధారణ చికిత్సలు అందించారు.

సంబంధిత పోస్ట్