ఇటిక్యాల మండలం వల్లూరు వద్ద ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని పంటలు నాలుగు రోజుల క్రితం నీట మునిగిన విషయం విధితమే. అయితే పంటలు మునిగిన విషయాన్ని రైతులు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఆయన పంటలు పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తుమ్మిళ్ల మోటార్ ఆన్ చేపించారు. దీనితో ఆర్డీఎస్ కాల్వకు జలకళ సంతరించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.