ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సర్పంచ్

అలంపూర్ మండల పరిధిలోని గుందిమల్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ పుష్పావతి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మొదటి ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు, ప్రజల సంక్షేమం కోసం మరిన్ని హామీలను నెరవేరుస్తున్నామని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, దీనికి ప్రజల సహకారం కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్