అలంపూర్ లోని అష్టదశ పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఉభయ ఆలయాలను టిడిపి పార్టీ తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జయరాం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. వీరితోపాటు అలంపూర్ మండలానికి చెందిన టిడిపి పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు, చంద్రశేఖర్ నాయుడు కూడా ఉన్నారు.