పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాలు

అలంపూర్ పరిధిలోని వడ్డేపల్లి మండలం జిల్లేడు దిన్నె, జక్కిరెడ్డి పల్లి గ్రామాలలో శనివారం నాడు పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 26 మంది రైతులకు చెందిన మొత్తం 124 పశువులకు (23 ఎద్దులు, కోడెలు, దూడలు, ఆవులు, 101 గేదెలు, దున్నపోతులు, దూడలు) గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. పశు వైద్య అధికారి డాక్టర్ స్వరూప రాణి మాట్లాడుతూ, పశువులకు ఈ వ్యాధి రాకుండా ముందస్తు టీకాలు వేయించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి వర ప్రసాద్, సర్పంచ్ సువర్ణవెంకటేశ్వరరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్