జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామంలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఐటీఐ చదువుతున్న అర్ఫాన్ (20) అనే యువకుడు, పత్తి పొలంలో కాడెద్దులతో నాగలి దున్నుతుండగా ఇనుప గుంటిక విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. రైతులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అదృష్టవశాత్తు ఎద్దులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే విజయుడు, మాజీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.