పోక్సో కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష: ఎస్పి

మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం ఒక మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన నిందితుడు యెర్ర సురేష్ కు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించింది. 2022లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టి, చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం ప్రత్యేక సెషన్స్ న్యాయమూర్తి నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించినట్లు ఎస్పీ డి. జానకి తెలిపారు.

సంబంధిత పోస్ట్