మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలని సూచించారు. బుధవారం మహమ్మదాబాద్ మండలంలోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. గురువారం ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ అనంతరం విజేతలను ప్రకటించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్