బీఆర్ఎస్ లో కి బీజేపీ యువమోర్చా మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షుడు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పట్టణ యువమోర్చా అధ్యక్షుడు శివకృష్ణ, తన అనుచరులతో కలిసి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు రాజు, కళ్యాణి, గణేశ్ వంటి పలువురు కార్యకర్తలు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ వారికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.

సంబంధిత పోస్ట్