మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్ పూర్ మండలంలోని దివిటిపల్లి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ జడ్చర్ల నుంచి భూత్ పూర్ వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే, చంద్రశేఖర్ కు ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఆయన సురక్షితంగా బయటపడ్డారని స్థానికులు తెలిపారు.