దేవరకద్ర: కురుమూర్తి జాతరలో విచ్చలవిడిగా మద్యం

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి జాతరలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. బీరు ధర రూ. 190 ఉండగా, రూ. 260 వసూలు చేస్తున్నారని, మటన్ దుకాణాల్లోనూ ధరలు ఎక్కువగా పెట్టి, తూకం తక్కువ వేస్తున్నారని ఘర్షణలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అక్రమాలపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్