దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకల్ మండలం రామచంద్రపూర్ కు చెందిన దీప్తి(20) అనే మహిళ బుధవారం అంబులెన్స్‌లో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమయ్యాయి. 108 సిబ్బంది యాదయ్య, జహంగీర్ సహాయంతో ఆమె ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చింది. ప్రథమ చికిత్స అనంతరం తల్లి, పిల్లలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.