వేసవిలో బీర్ల కొరత లేకుండా చూడాలని ఒక మంత్రి స్వయంగా కంపెనీకి వెళ్లి ఆదేశాలు ఇవ్వడం ఆశ్చర్యకరమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అదే సమయంలో రైతులకు అత్యవసరమైన యూరియా కొరతపై మాత్రం మంత్రులకు ఎలాంటి శ్రద్ధ కనిపించడం లేదని మండిపడ్డారు. దేవరకద్రలో ఆల మాట్లాడుతూ, రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూలలో నిలబడుతూ కష్టాలు పడుతున్నా ఆ పరిస్థితి ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు.