దేవరకద్ర: ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కేబీఆర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి చెందుతున్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్