దేవరకద్ర: బిఆర్ఎస్ పేద ప్రజలను మోసం చేసింది: ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మండలం పోతులమడుగు గ్రామంలో చంద్ బీ మైనుద్దీన్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ పథకం పేరుతో పేద ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్